Re Releases on Shivaratri : శివరాత్రికి సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్‌లు.. టైమింగ్స్ అండ్ ప్లేస్ తెలుసుకోండి!
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరో నుంచి చిన్న హీరో వరకు వారివారి సూపర్ హిట్ మూవీలను రీ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. తాజాగా ఇప్పుడు ఒకే రోజు 8 సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కావడంతో...

Re Releases in Shivaratri
Re Releases in Shivaratri : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరో నుంచి చిన్న హీరో వరకు వారివారి సూపర్ హిట్ మూవీలను రీ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. ఎటువంటి రిస్క్ లేకుండా ఆల్రెడీ రిలీజ్ అయిన చిత్రాన్ని మళ్ళీ విడుదల చేసి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. దీంతో రీ రిలీజ్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి పలు చిత్రాలు. తాజాగా ఇప్పుడు ఒకే రోజు 8 సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
Krrish 4 : క్రిష్ 4.. డైరెక్టర్ మారనున్నాడా? ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్??
ఫిబ్రవరి 18న శివరాత్రి కావడంతో, ప్రేక్షకులు వారి అభిమాన హీరో సినిమాలతో జాగారం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాని ఫిబ్రవరి 18 అర్ధరాత్రి హైదరాబాద్ సంధ్య 70MM థియేటర్ లో గం.12.15 ఒక షో, గం.3 గంటలకు ఒక షో వేయనున్నారు. అలాగే బాలకృష్ణ శివతాండవం చేసిన ‘అఖండ’ చిత్రాన్ని.. హైదరాబాద్ సుదర్శన్ 35MM లో గం.12.15 షో, మరో థియేటర్ సుష్మ 70MM లో గం.11.49 గంటలకు షో వేయనున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని.. కొత్త పేటలోని మహాలక్ష్మి కంప్లెక్స్ లో 3 గంటలకు ప్రదర్శింస్తుండగా, మహేష్ బాబు దూకుడు చిత్రాన్ని – సుదర్శన్ లో 3 గంటలకు, సరిలేరు నీకెవ్వరు మూవీని – మహాలక్ష్మి కంప్లెక్స్ లో 11.59 కి ప్రదర్శించబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన టెంపర్ సినిమాని – హైదరాబాద్ దేవి థియేటర్ లో 12.15 లకు, సంధ్య థియేటర్ లో 12.30 లకు షోలు వేయనున్నారు. ఇక రీసెంట్ సెన్సేషన్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ ని – సుష్మ 70MM లో 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు.