Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాయి. టిక్కెట్టు ధర.. సమయం వివరాల కోసం చదవండి.

Ram Mandir Opening Ceremony

Ram Mandir Opening Ceremony : జనవరి 22న అయోధ్యలో జరగబోతున్న రామ మందిర ప్రారంభోత్సవ అపూరూప ఘట్టానికి మరికొన్ని గంటలు సమయం ఉంది. ఆ అద్భుత క్షణాలు వీక్షించడానికి ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకను పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.

Rukmini Vasanth : తెలుగులోకి మరో కన్నడ భామ.. ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. స్టార్ హీరో సరసన..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించడానికి దేశం యావత్తు ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపించడానికి మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ ఐనాక్స్  న్యూస్ ఛానెల్ ఆజ్ తక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థల కో-ఫౌండర్ గౌతమ్ దత్తా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు వీక్షించేలా తాము అవకాశం కల్పించడం అదృష్టంగా  భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆన్ లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం  1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.  టికెట్ ధర రూ.100 రూపాయలు కాగా  ప్రతి టికెట్‌పై పాప్ కార్న్ కాంబోను కూడా అందిస్తున్నారు. భారతదేశంలోని 160కి పైగా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Ananyaa : ‘జర్నీ’ హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేస్తుంది?

ప్రపంచ వ్యాప్తంగా 11,000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రజనీకాంత్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మోహన్‌లాల్, ధనుష్ వంటి సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 1987 లో వచ్చిన ‘రామాయణ్’ టీవీ సీరియల్‌లో శ్రీరాముడు, సీతాదేవి పాత్రల్లో నటించిన అరుణ్ గోవిల్, దీపిక చిక్లియా కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు