Ananyaa : ‘జర్నీ’ హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేస్తుంది?

'జర్నీ' సినిమాలో నటించిన అనన్య గుర్తుందిగా. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెలుగులో ఆఫర్లు లేకపోయినా మళయాళంలో బిజీగానే ఉన్న ఈ నటి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ananyaa : ‘జర్నీ’ హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేస్తుంది?

Ananyaa

Updated On : January 21, 2024 / 1:20 PM IST

Ananyaa : 2011లో వచ్చిన ‘జర్నీ’ సినిమా చూసిన వాళ్లు నటి అనన్యని గుర్తు పడతారు. ఈ సినిమా తర్వాత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా ఇప్పుడు అనన్యని గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.

AR Murugadoss : ఫ్లాప్స్‌లో ఉన్నా కోటిన్నర పెట్టి కారు కొన్న స్టార్ డైరెక్టర్

అనన్య అసలు పేరు ఆయిల్య గోపాలకృష్ణన్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అనన్యగా మార్చుకున్నారు. కేరళ కుట్టి అయిన ఈ నటి చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1995 లో ‘బ్రదర్స్’ అనే సినిమాలో నటించారు. ఆర్చరీలో అనన్యకు రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు ఉంది. అంతేకాదు అనన్య సింగర్ కూడా.  ఆమె తండ్రి ప్రముఖ సినీ నిర్మాత గోపాలకృష్ణన్ నాయర్. 2008 ‘పాజిటివ్’ అనే మళయాళ సినిమాతో హీరోయిన్‌గా కెరియర్ ప్రారంభించిన అనన్య ‘జర్నీ’ సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యారు. ‘అమాయకుడు’ అనే తెలుగు మూవీతో పాటు అఆ, మహర్షి వంటి టాప్ డైరెక్టర్లు తీసిన సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. కాగా తెలుగులో ఎందుకో అనన్య అంత పేరు సంపాదించుకోలేకపోయారు.

Sitara Ghattamaneni : అనాధ పిల్లలతో కలిసి గుంటూరు కారం సినిమా చూసిన సితార.. పొగిడేస్తున్న అభిమానులు..

అనన్య తెలుగులో కనిపించకపోయినా మళయాళ సినిమాల్లో మాత్రం బిజీగానే ఉన్నారు. 2012 లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లాడిన అనన్య పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అటు ఫ్యామిలీ, ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాగా ఇటీవల అనన్యను చూసిన వారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అంటున్నారు. జర్నీలో నటించిన అనన్యేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట్లో ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ananyaa (@ananyahere)