Christmas Movies : ఇయర్ ఎండింగ్.. క్రిస్మస్ వార్..

ప్రతీ ఏడాది బిగినింగ్ కు సంక్రాంతి ఎలాగో.. ఇయర్ ఎండింగ్ కు క్రిస్మస్ అంతే కీలకం. ఈ క్రిస్మస్ సీజన్ లో ఇప్పటివరకైతే ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. వాటిలో మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు.........

Christmas Movies : ఇయర్ ఎండింగ్.. క్రిస్మస్ వార్..

Ready to release Christmas movies

Updated On : December 8, 2022 / 11:14 AM IST

Christmas Movies : ప్రతీ ఏడాది బిగినింగ్ కు సంక్రాంతి ఎలాగో.. ఇయర్ ఎండింగ్ కు క్రిస్మస్ అంతే కీలకం. ఈ క్రిస్మస్ సీజన్ లో ఇప్పటివరకైతే ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. వాటిలో మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ ఐదు సినిమాలపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అన్ని సినిమాలు కూడా వేటికవి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రాబోతున్నాయి.

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జోడీగా నందిని రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న వెరైటీ లవ్ స్టోరీ ‘అన్నీ మంచిశకునములే’. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలకు రెడీ అయింది. ఇటీవలే సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పర్వాలేదనిపించాడు.

ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ ధమాకా. సినిమాపై మంచి అంచనాలున్నాయి. సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రవితేజ గత సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా భారీ హిట్ కొట్టిన నిఖిల్ డిసెంబర్ 23నే మరోసారి అనుపమా పరమేశ్వరన్ జోడీగా సూర్యప్రతాప్ పల్నాటి రూపొందించిన ‘18 పేజెస్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ కథ అందించాడు. కార్తికేయ 2 సూపర్ సక్సెస్ క్రేజ్ తో ఈ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయింది.

Adivi Sesh : అడవిశేష్ 350 కోట్లు సంపాదించాడా?? తన రెమ్యునరేషన్ పై శేష్ క్లారిటీ..

ఈ క్రిస్మస్ సీజన్ ను క్యాష్ చేసుకోడానికి రెండు తమిళ డబ్బింగ్ మూవీస్ కూడా పోటీకి రెడీ అయ్యాయి. విశాల్ హీరోగా ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ ‘లాఠీ’. ఇందులో విశాల్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు.

అదే రోజున లేడీ సూపర్ స్టార్ నయనతార మెయిన్ లీడ్ లో ‘కనెక్ట్’ అనే హారర్ థ్రిల్లర్ కూడా రీలీజ్ కాబోతోంది. అయితే కేవలం గంటన్నర సినిమా ఇంటర్వెల్ లేకుండా దీనిని విడుదల చేయనుండటం విశేషం. సత్యరాజ్, అనుపమ ఖేర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ క్రిస్మస్ సీజన్ లో ఏ సినిమాది పై చేయి అవుతుందో చూడాలి.