Reba Monica : బ్రో సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి.. సామజవరగమన ఛాన్స్ అందుకున్న రెబా మోనికా.. ఏం జరిగింది..?
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి సామజవరగమన ఛాన్స్ అందుకుంది హీరోయిన్ రెబా మోనికా. అసలు అప్పుడు ఏం జరిగింది..?
Reba Monica John : అందాల భామ రెబా మోనికా జాన్.. మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వస్తుంది. రీమేక్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి ఎప్పుడో పరిచయమైన ఈ భామ.. ఇటీవల ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమాతో టాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చింది. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ హరికృష్ణ సినిమా రీమేకా..? అసలు నిజం ఏంటంటే..?
అయితే రెబా మోనికా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో అవకాశం అందుకోవడానికి వచ్చి అనుకోకుండా సామజవరగమనలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. బ్రో (Bro) మూవీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో సాయి ధరమ్ తేజ్ చెల్లి పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చేందుకు రెబా మోనికా హైదరాబాద్ వచ్చిందట. మరి మేకర్స్ సాయి ధరమ్ కి చెల్లిగా రెబా మోనికా సెట్ అవ్వదు అని అనుకున్నారో ఏమో తెలియదు గాని, ఆమెకు కారణం కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారట.
Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?
ఇక ఎలాగో హైదరాబాద్ వరకు వచ్చాము కాదా అని, అదే సమయంలో సామజవరగమన మూవీ ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళింది. అక్కడ చిత్ర యూనిట్ రెబా మోనికాని హీరోయిన్ గా ఎంపిక చేసేయడం, మొదటి సినిమాతోనే తెలుగు రెబా బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగిపోయింది. కాగా బ్రో సినిమాలో తేజ్ కి చెల్లిగా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించింది. ఒకవేళ రెబా మోనికా ఆ సినిమాలో నటించినా ఇప్పుడు వచ్చినంత గుర్తింపు వచ్చి ఉండకపోవచ్చు. ప్రస్తుతం రెబా మలయాళ, కన్నడ సినిమాల్లో ఒకొక సినిమా చేస్తుంది. మరి తెలుగులో ఏమన్నా కొత్త ఆఫర్లు అందుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.