బక్కగా మారిన ‘బాహుబలి’

  • Published By: sekhar ,Published On : November 25, 2020 / 01:41 PM IST
బక్కగా మారిన ‘బాహుబలి’

Updated On : November 25, 2020 / 2:19 PM IST

Rebelstar Prabhas: రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సాలిడ్ బాడీతో ఆజానుబాహుడిలా కనిపించే బాహుబలి తాజా ఫొటోలో సన్నగా, ఫిట్‌గా కనిపించాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి అయింది.



https://10tv.in/6-million-instagram-followers-for-superstar-mahesh-babu/
డార్లింగ్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాల కోసం రెడీ అవుతున్నాడు. వైజయంతి బ్యానర్లో, ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.Prabhasఅలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరెక్కించనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’ లో రాముడి క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాల కోసమే ప్రభాస్ తన లుక్‌ మార్చుకున్నట్టు తెలుస్తోంది. రెబల్‌స్టార్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.