‘మహర్షి’ డిజిటల్ రైట్స్ భారీ ధరకు !
వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు.

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు.
వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని విలేజ్ సెట్ లో దాదాపుగా 25 రోజుల పాటు మహర్షి షూటింగ్ జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
Read Also : ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ : బైక్‌ను లాఠీతో పగలకొట్టాడు
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ వార్తలే వినవస్తున్నాయి. నిన్నటికి నిన్న ఈ సినిమా నిర్మాత దిల్ రాజు మహర్షి హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ ని 20 కోట్లకు సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇక ఈ రోజు మహర్షి డిజిటల్ హక్కుల విషయంలో మరో సెన్సేషనల్ న్యూస్ వినబడుతుంది. ఈ సినిమా మహేశ్ బాబుకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనేది అభిమానుల మాట.
Read Also : లుక్ ఎలా ఉంది : ‘దబాంగ్-3’ షూటింగ్ స్టార్ట్