Rekha Vedavyas : ఎందుకు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటే.. ఎమోషనల్ అవుతూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాజాగా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఈ షోలో రేఖ సన్నగా అయిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయి, ఫేస్ కూడా మారిపోయి, చాలా వీక్ గా కనిపించింది. దీంతో రేఖ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Rekha Vedavyas : ఎందుకు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటే.. ఎమోషనల్ అవుతూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Rekha Vedavyas has changed beyond recognition recent photos goes viral rekha gives clarity about her health

Updated On : September 25, 2023 / 10:29 AM IST

Rekha Vedavyas :  కొంతమంది హీరోయిన్స్ 40 ఏళ్ళు దాటినా అంతే యవ్వనంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఇటీవల ఒకప్పటి హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరికి షాకిచ్చింది. ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది రేఖ. ఈ సినిమాలు మంచి విజయం సాధించినా తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కన్నడ భామ అయిన రేఖ వేదవ్యాస్ ఆ తర్వాత వరుసగా కన్నడలో సినిమాలు చేసింది. 2014 నుంచి సినిమాలకు దూరమైన రేఖ ఇటీవల పలు షోలలో కనిపిస్తుంది.

కొన్ని నెలల క్రితం వేరే తెలుగు షోలలో కనిపించిన రేఖ అప్పుడు బాగానే ఉన్నా తాజాగా తెలుగులో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోకి రేఖ రాగా అందరూ ఆమెని చూసి షాక్ అయ్యారు. రేఖ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ షో ప్రోమో రిలీజ్ అయినప్పుడే రేఖ ఫోటోలు వైరల్ గా మారగా ఎందుకు అలా మారిపోయింది అనేది ఎపిసోడ్ లో చెప్తుందని ఎదురుచూశారు ప్రేక్షకులు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాజాగా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఈ షోలో రేఖ సన్నగా అయిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయి, ఫేస్ కూడా మారిపోయి, చాలా వీక్ గా కనిపించింది. దీంతో రేఖ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోని, వీడియోని చూసిన జనాలు అసలు ఈమె నిజంగానే రేఖనేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా మారిపోవడానికి కారణాలు రేఖ చెప్తూ.. నాకు ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చిన్న తలనొప్పి అవ్వొచ్చు లేదా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ అవ్వొచ్చు కానీ ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడికి లోనయితే ఆ ఆరోగ్య సమస్యలు ఇంకా పెద్దవి అవుతాయి. దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఒక్కోసారి డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేయకపోయినా మన నమ్మకం మనల్ని కాపాడుతుంది అని తెలిపింది.

Rekha Vedavyas has changed beyond recognition recent photos goes viral rekha gives clarity about her health

Also Read : Vishwak Sen : ఆంజనేయస్వామి మాల వేసుకున్న విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..

దీంతో రేఖకు ఏదో ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు, డాక్టర్స్ వద్దకి వెళ్తే వారు ఇచ్చిన మందులు ఎఫెక్ట్ అయి రేఖ ఇలా మారిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఏ ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నది మాత్రం రేఖ చెప్పలేదు.