Renu Desai : ప‌వ‌న్ అరుదైన వ్య‌క్తి.. నా మ‌ద్ద‌తు ఆయ‌నకే.. 11 ఏళ్ల నుంచి దూరంగానే ఉన్నాం.. పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దు

ఏపీ రాజకీయ పరిణామాలపై సినీనటి రేణూ దేశాయ్‌ (Renu Desai) స్పందించింది. దయచేసి త‌న‌ పిల్లలను రాజకీయాల్లోకి లాగవ‌ద్ద‌ని కోరింది.

Renu Desai-Pawan Kalyan

Renu Desai-Pawan Kalyan : ఏపీ రాజకీయ పరిణామాలపై సినీనటి రేణూ దేశాయ్‌ (Renu Desai) స్పందించింది. దయచేసి త‌న‌ పిల్లలను రాజకీయాల్లోకి లాగవ‌ద్ద‌ని కోరింది. పిల్లలకు రాజకీయాలంటే తెలియవ‌ని, వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ల‌కు తెలియ‌ద‌న్నారు. త‌న పిల్లలనే కాదు ఏ పిల్లలను, ఆడవాళ్లను ఇందులోకి లాగొద్ద‌ని అభిమానులు, రాజకీయ నాయకులు, విమర్శకులకు విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

త‌న మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఓ అరుదైన వ్య‌క్తి అని, రాజ‌కీయంగా ఆయ‌న‌కే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మొద‌టి రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా రాజ‌కీయంగా ప‌వ‌న్‌కు తాను స‌పోర్టు చేస్తూనే ఉన్నాన‌ని తెలిపారు. “నేను నా జీవితంలో ముందుకు సాగిపోతున్నా. స‌మాజానికి మంచి చేయాల‌ని ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. నాకు తెలిసినంత వ‌ర‌కు ఇలాంటి వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయ‌న డ‌బ్బు మ‌నిషి కాదు. స‌మాజం, పేద‌వాళ్ల సంక్షేమం కోసం ప‌ని చేయాల‌నుకుంటారు. నా వ్య‌క్తిగ‌త బాధ‌ను ప‌క్క‌న‌పెట్టి రాజ‌కీయంగా త‌న‌కు ఎప్పుడు మ‌ద్దుగా ఉంటా.” అని రేణూ దేశాయ్‌ అన్నారు.

Gandeevadhari Arjuna Trailer : యాక్ష‌న్ మోడ్‌లో వరుణ్‌తేజ్‌.. ఆద్యంతం ఉత్కంఠ‌గా గాంఢీవధారి అర్జున ట్రైలర్‌

ప‌వ‌న్ త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప‌క్క‌న‌బెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, ప‌వ‌న్‌కు ఒక్క‌సారి అవ‌కాశం ఇచ్చి చూడాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఇది తాను ఆయ‌న మాజీ భార్య‌గా చెప్ప‌డం లేద‌ని, స‌మాజంలో ఓ పౌరురాలిగా మాత్ర‌మే అడుగుతున్నాన‌న్నారు. ప్ర‌తీసారీ ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని, వ్య‌క్తిగ‌త జీవితాన్ని రాజ‌కీయాల‌తో ముడిపెట్ట‌వ‌ద్ద‌ని కోరారు.

“వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తుంటే నాకు బాధగా ఉంటుంది. 11 ఏళ్ల నుంచి మేం దూరంగా ఉన్నాం.. ఉంటున్నాం. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని పదే పదే అంటుంటే నాకే బాధగా ఉంది. సమాజం ఏం అనుకుంటుందనేది నాకు అనవసరం. పవన్ కు అవకాశం ఇచ్చి చూడండి, ప్రజలకు మంచి చేస్తాడు.” అని రేణు చెప్పారు.

Vijay Deverakonda : నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాల్సిందే.. ఇండస్ట్రీలో నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు..

ఇటీవ‌ల విడుద‌లైన ఓ సినిమాలోని స‌న్నివేశాలు వివాదానికి దారి తీశాయ‌ని తెలిసింది. అయితే.. దాని గురించి త‌న‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేన‌ట్లు చెప్పింది. అయితే.. కొంద‌రు ప‌వ‌న్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామ‌ని అంటున్నారు. ఇందులో ఆయ‌న పెళ్లిళ్లు, భార్య‌లు, పిల్ల‌ల గురించి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఓ త‌ల్లిగా నా అభ్య‌ర్థ‌న ఒక్క‌టే. ప‌రిస్థితులు ఏమైన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను మాత్రం ఇందులోకి లాగ‌కండి. మా పిల్ల‌లు సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. ఆయ‌న తండ్రి ఓ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు. ఏదైన ఉంటే మీరు మీరు చూసుకోండి అని వీడియోలో రేణు దేశాయ్ కోరారు.

ట్రెండింగ్ వార్తలు