Akira Nandan : పవన్ కళ్యాణ్‌ని అచ్చు గుద్దేసినట్టు దింపిన అకిరా నందన్.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..

ఇటీవల అకిరా బాగా వైరల్ అవుతున్నాడు. ఇన్నాళ్లు చిన్నపిల్లాడిలా కనపడ్డ అఖిల్ ఇప్పుడు గడ్డాలు, మీసాలు వచ్చి పెద్దవాడు అయిపోయాడు.

Akira Nandan : పవన్ కళ్యాణ్‌ని అచ్చు గుద్దేసినట్టు దింపిన అకిరా నందన్.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..

Renu Desai Shares Akira Nandan Photos Fans Comparing with Pawan Kalyan Photos

Updated On : January 28, 2024 / 10:07 AM IST

Akira Nandan – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తనయుడిగా అకిరా నందన్ అందరికి పరిచయమే. తండ్రి బాటలోనే అకిరా కూడా హీరో అవుతాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ అకిరా హీరో అవ్వడు, కాకపోతే సినీ పరిశ్రమలోనే ఉంటాడు అని రేణు దేశాయ్(Renu Desai) క్లారిటీ ఇచ్చింది. అకిరా సంగీత దర్శకుడు అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్ లో కోర్స్ కూడా చేస్తున్నాడు.

ఇటీవల అకిరా బాగా వైరల్ అవుతున్నాడు. ఇన్నాళ్లు చిన్నపిల్లాడిలా కనపడ్డ అఖిల్ ఇప్పుడు గడ్డాలు, మీసాలు వచ్చి పెద్దవాడు అయిపోయాడు. సంక్రాంతికి అకిరా, ఆద్య ఫోటోలు షేర్ చేయగా వాటిలోనే అకిరా పవన్ లానే కనిపిస్తున్నాడని అభిమానులు ఆ ఫొటోలని తెగ వైరల్ చేశారు. తాజాగా రేణు దేశాయ్ కొన్ని అకిరా నందన్ ఫొటోలతో చేసిన ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Mysskin : నాకు, పూర్ణకు సంబంధం ఉందని రాశారు.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. ఎమోషనల్ అయిన పూర్ణ..

ఈ ఫొటోల్లో అకిరాని చూస్తుంటే అచ్చం పవన్ కళ్యాణ్ ని దించేసినట్టు ఉన్నాడు. అకిరాని చూస్తుంటే పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నాడో గుర్తొస్తున్నాడు. ఓ ఫొటోలో అకిరా ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ ని అచ్చు గుద్దినట్టు దింపాడు. మరో ఫొటోలో పవన్ కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నట్టు ఉన్నాడు. దీంతో అకిరా, పవన్ ఫోటోలు పక్కపక్కన పెట్టి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు.