Darshan : రేణుకస్వామి హత్య కేసులో ఆ ముగ్గురికి బెయిల్.. హీరో మాత్రం ఇంకా జైల్లోనే..
కన్నడ స్టార్ హీరో దర్శన్ మూడు నెలల క్రితం తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Renuka Swamy Case Three Members Granted Bail But Heri Darshan still in Jail
Darshan – Renuka Swamy : ఇటీవల కన్నడ స్టార్ హీరో దర్శన్ మూడు నెలల క్రితం తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడ, ఈ కేసుకు సంబంధం ఉన్న మరో 17 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ కేసు విచారణ సాగుతుంది. ఇప్పటివరకు వచ్చిన ఆధారాలు అన్ని దర్శనే హత్య చేయించాయి అని చెప్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అయితే తాజాగా ఈ హత్య కేసులో ముగ్గురికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఛార్జ్ షీట్ లో వీరిపై హత్య నేరం మోపగా అవి పోలీసులు ప్రస్తుతం విత్ డ్రా చేయడం గమనార్హం. రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ హత్య చేయించాడు అని కేశవ మూర్తి అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతనితో పాటు మరో ఇద్దరు కార్తీక్, నిఖిల్ కు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జిషీట్‌లో పోలీసులు వీరిపై హత్య ఆరోపణలను తీసేసారు.
Also Read : Koratala Siva : హాలీవుడ్ టెక్నిషియన్స్ కంటే మన వాళ్ళే చాలా అడ్వాన్స్.. ‘దేవర’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దీంతో ఈ విషయం చర్చగా మారింది. ఈ హత్యకేసులో ముఖ్య సూత్రధారి హీరో దర్శన్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.