Koratala Siva : హాలీవుడ్ టెక్నిషియన్స్ కంటే మన వాళ్ళే చాలా అడ్వాన్స్.. ‘దేవర’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా దేవర డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ హాలీవుడ్ టెక్నిషియన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Koratala Siva : హాలీవుడ్ టెక్నిషియన్స్ కంటే మన వాళ్ళే చాలా అడ్వాన్స్.. ‘దేవర’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Koratala Siva Interesting Comments on Hollywood Technicians before Devara Release

Updated On : September 24, 2024 / 2:09 PM IST

Koratala Siva : ఎన్టీఆర్ దేవర సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా వర్క్ చేసారు. మ్యుఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లకు సీనియర్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ పనిచేసారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కూడా దేవర యాక్షన్ సీక్వెన్స్ ల గురించి, సముద్రములో ఫైట్ గురించి గొప్పగా చెప్పారు. అయితే తాజాగా దేవర డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ హాలీవుడ్ టెక్నిషియన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Actor Karthi : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో కార్తీ

కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేసారు. అయితే హాలీవుడ్ టెక్నిషియన్స్ కంటే కొన్ని విషయాల్లో మనవాళ్లే చాలా అడ్వాన్స్ లో ఉంటారు. హాలీవుడ్ వాళ్లకు లైన్ టు లైన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ముందే రిహార్సిల్స్ చేయాలి. ఇన్ని అయ్యాక సెట్స్ లో అప్పటికప్పుడు ఏమన్నా ఛేంజెస్ చెప్తే తొందరగా అవ్వవు. కానీ మన టెక్నిషియన్స్ స్పాట్ లో ఏదైనా ఛేంజెస్ చేస్తే వాటిని అర్ధం చేసుకొని చాలా ఫాస్ట్ గా పనిచేస్తారు. కొంతమందికి మనం బేసిక్ లైన్ చెప్తే అర్ధం చేసుకొని పనిచేస్తారు. హాలీవుడ్ వాళ్లకు లైన్ టు లైన్ డిటైలింగ్ ఇవ్వాలి. మన వాళ్ళు చివరి నిమిషంలో కూడా పనిచేసే అలవాటు ఉండబట్టి ఫాస్ట్ గా చేయగలుగుతారు అని చెప్పారు. దీంతో కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.