RGV Comments on RRR Movie : RRR సినిమా చూస్తున్నంతసేపు సర్కస్ గుర్తొచ్చింది.. మరోసారి RRRపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో RRR సినిమా చూస్తే మీకెలా అనిపించింది అని అడిగారు. దీనికి సమాధానమిస్తూ ఆర్జీవీ.. ''నేను RRR‌ సినిమా చూశాను. నాకు ఆ సినిమా సర్కస్‌లా అనిపించింది. సర్కస్ అంటే నెగిటివ్ గా తీసుకోకండి. సర్కస్‌ చూస్తున్నప్పుడు..............

RGV Comments on RRR Movie : RRR సినిమా చూస్తున్నంతసేపు సర్కస్ గుర్తొచ్చింది.. మరోసారి RRRపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

RGV Comments on RRR Movie

Updated On : August 23, 2022 / 11:21 AM IST

RGV Comments on RRR Movie :  జనాలంతా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకునే టాపిక్స్ మీద ట్వీట్స్ వేయడం, వెరైటీగా మాట్లాడటం చేస్తూ ఉంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన RRR సినిమాని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ అభినందిస్తున్నారు. గతంలోనే ఆర్జీవీ కూడా RRR సినిమాని అభినందించారు. తాజాగా మరోసారి RRR సినిమాపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Vijay Devarakonda Fan Girl Moment : విజయ్ దేవరకొండకి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేసి.. ఉంగరం తొడిగిన బెంగుళూరు అమ్మాయి..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో RRR సినిమా చూస్తే మీకెలా అనిపించింది అని అడిగారు. దీనికి సమాధానమిస్తూ ఆర్జీవీ.. ”నేను RRR‌ సినిమా చూశాను. నాకు ఆ సినిమా సర్కస్‌లా అనిపించింది. సర్కస్ అంటే నెగిటివ్ గా తీసుకోకండి. సర్కస్‌ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో నాకు RRR సినిమా చూసినప్పుడు అలాంటి ఉత్సాహమే కలిగింది. ముఖ్యంగా సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో బ్రిడ్జి మీద రామ్‌చరణ్‌, తారక్‌లు చేసిన సీన్లు చూస్తే చిన్నప్పుడు చూసిన జెమినీ సర్కస్‌ గుర్తొచ్చింది. ఆ సర్కస్ లో కూడా అలాంటి ఫీట్లే చేసేవారు” అని అన్నాడు. దీంతో ఆర్జీవీ RRR సినిమాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఫ్యాన్స్ కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందిస్తారేమో చూడాలి.