RGV Hotel : గోదావరి జిల్లాల్లో ఆర్జీవీ హోటల్

తూర్పు గోదావరి జిల్లాలో ఓడలరేవు వైపుగా వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్‌ దగ్గర రామ్‌గోపాల్‌వర్మ ఫొటోతో కనిపించే హోటల్‌ ఉంటుంది. ఆ హోటల్ లో తిందామని లోపలికి వెళ్తే........

RGV Hotel : గోదావరి జిల్లాల్లో ఆర్జీవీ హోటల్

Rgv Hotel

Updated On : December 26, 2021 / 2:25 PM IST

RGV Hotel :  ఆర్జీవిని ఎంతమంది వ్యతిరేకిస్తారో అంతేమంది ప్రేమిస్తారు. చాలా మందికి ఆర్జీవీ అంటే పిచ్చి. కేవలం ఆయన సినిమాలతోనే కాక ఆయన మాటలతోటి చాలా మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు ఆర్జీవీ. ఆయన చెప్పిన మాటలు అందరూ వ్యతిరేకించినా ఒక్క క్షణం ఆలోచిస్తే ఆర్జీవీ చెప్పేవన్నీ అక్షర సత్యాలే అని మనకే తెలుస్తుంది. అందుకే ఆర్జీవికి అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అలంటి అభిమానుల్లో ఒక అభిమాని ఏకంగా ఆర్జీవీ పేరుతో హోటల్ పెట్టేశాడు. ఆ హోటల్ లో ఆర్జీవీ ప్రపంచాన్ని సృష్టించాడు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తి ఆర్జీవీకి వీరాభిమాని. ఆర్జీవీ పేరుతో హోటల్‌ పెట్టి స్థానికంగా ఫేమస్‌ అయ్యాడు. ఇతని కుటుంబంలో అందరూ ఆర్జీవీ అభిమానులే. తూర్పు గోదావరి జిల్లాలో ఓడలరేవు వైపుగా వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్‌ దగ్గర రామ్‌గోపాల్‌వర్మ ఫొటోతో కనిపించే హోటల్‌ ఉంటుంది. ఆ హోటల్ లో తిందామని లోపలికి వెళ్తే అక్కడ అంతా ఆర్జీవీ ప్రపంచమే కనిపిస్తుంది. హోటల్ మొత్తం రామ్‌గోపాల్‌వర్మ ఫొటోలు, పోస్టర్లు, రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన కొటేషన్లు దర్శనమిస్తాయి.

RGV : నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ

ఈ హోటల్ పెట్టిన వెంకటరమణ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ”హోటల్‌ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడే మా అన్న, నేను నిర్ణయించేసుకున్నాం. హోటల్‌ అంటే పెడితే రామ్‌గోపాల్‌వర్మ పేరునే పెట్టాలని అనుకున్నాం” అని అన్నారు. రాబోయే రోజుల్లో కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా రాంగోపాల్ వర్మ హోటల్ పెట్టాలన్నది తన లక్ష్యం అని చెబుతున్నాడు వెంకటరమణ. ఈ హోటల్ వ్యాపారంలో బాగా కలిసొస్తే మంచి సిటీలో పెట్టే హోటల్ ని ఎలాగైనా రామ్ గోపాల్ వర్మ చేతులమీదుగా ప్రారంభించదానికి ట్రై చేస్తాను అని తెలిపాడు ఈ ఆర్జీవీ వీరాభిమాని. ఇక ఈ హోటల్ పై ఆర్జీవీ ట్వీట్ చేయడంతో వెంకటరమణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.