Green India Challenge : నాకు పచ్చదనం, మట్టి నచ్చదు అంటూనే చెట్లు నాటిన ఆర్జీవీ

తాజాగా వర్మ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అయితే ఆర్జీవీ ఇలాంటివి అస్సలు ఫాలో అవ్వడు. కానీ కొత్తగా ఇలా మొక్కలు నాటడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.....

Green India Challenge : నాకు పచ్చదనం, మట్టి నచ్చదు అంటూనే చెట్లు నాటిన ఆర్జీవీ

Rgv

Updated On : March 20, 2022 / 6:52 PM IST

RGV :  వివాదాల దర్శకుడు ఆర్జీవీ తన రూటే సపరేట్ అంటూ మాట్లాడతారు, ట్వీట్స్ చేస్తారు. మన చుట్టూ జరిగే అనేక రకాల విషయాలపై ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో, టీవిలో, యూట్యూబ్ లో యాక్టీవ్ గా ఉంటారు ఆర్జీవీ. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ఆర్జీవీ.

RRR : సుమకి చాదస్తం ఎక్కువ.. ఎప్పుడో పుట్టింది.. ఎన్టీఆర్ కామెంట్స్

తాజాగా వర్మ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అయితే ఆర్జీవీ ఇలాంటివి అస్సలు ఫాలో అవ్వడు. కానీ కొత్తగా ఇలా మొక్కలు నాటడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న ఆర్జీవితో కలిసి మొక్కలు నాటిన ఫోటోలని షేర్ చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అని తెలిపింది. దానిని ఆర్జీవీ షేర్ చేశారు. అంతే కాక ఆర్జీవీ మొక్క నాటుతున్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ”ఈ ఫొటోలో ఉన్నది నేను కాదు. ఎందుకంటే నాకు మట్టి, పచ్చదనం నచ్చదు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్జీవీ ఓ మంచి పని చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.