BiggBoss Non Stop : ఈ సారి బిగ్‌బాస్‌‌లో ఆర్జీవీ సపోర్ట్ ఎవరికో తెలుసా??

దీంతో సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సారి ఎవరికీ సపోర్ట్ ఇస్తారా అంటూ అంతా ఎదురు చూశారు. గతంలో చాలా సార్లు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా బిగ్‌బాస్‌‌ గురించి మాట్లాడారు. షోలో అంతా.......

BiggBoss Non Stop : ఈ సారి బిగ్‌బాస్‌‌లో ఆర్జీవీ సపోర్ట్ ఎవరికో తెలుసా??

Rgv

Updated On : March 7, 2022 / 4:41 PM IST

 

RGV :  ఈ సారి 24 గంటలంటూ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం నుండే రసవత్తరంగా సాగుతుంది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. దీంతో ఈ సారి గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది. ఇక ఎప్పటిలాగే హౌస్ లో ఉన్న వారి కోసం బయటి నుంచి ఫ్యాన్స్, తమ తోటి సెలబ్రిటీలు ప్రమోషన్స్ చేస్తున్నారు.

దీంతో సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సారి ఎవరికీ సపోర్ట్ ఇస్తారా అంటూ అంతా ఎదురు చూశారు. గతంలో చాలా సార్లు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా బిగ్‌బాస్‌‌ గురించి మాట్లాడారు. షోలో అంతా ఆడవాళ్లు ఉండి నేనొక్కడ్నే ఉంటే కచ్చితంగా నేను కూడా బిగ్‌బాస్‌‌ లో పాల్గొంటాను అని గతంలో వ్యాఖ్యలు కూడా చేశారు. ఆర్జీవీ గతంలో అరియానాకు మద్దతు ఇచ్చాడు. అరియనాకి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ కూడా వేశాడు.

BiggBoss Non Stop : ముమైత్ నా చెయ్యి విరగ్గొట్టింది.. బిగ్‌బాస్ లో పాతవి గుర్తుచేసుకొని ఏడ్చేసిన శ్రీరాపాక

ఇటీవల గత సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన అరియనా, అషురెడ్డిలతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి హల్ చల్ సృష్టించారు. దీంతో వీరిద్దరూ బాగా ఫేమస్ అయిపోయారు. అయితే గతంలో అరియనాకి సపోర్ట్ చేసి ఆ తర్వాత అరియనా, అషులతో ఇంటర్వ్యూలు చేసి క్లోజ్ అవ్వడంతో ఈ సారి బిగ్‌బాస్‌‌ లో కూడా వీరిద్దరికి ఆర్జీవి సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి ఆలోచనలని తప్పు చేస్తూ తాజాగా మరో బోల్డ్ బ్యూటీకి సపోర్ట్ చేశారు ఆర్జీవీ.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటున్న శ్రీ రాపాకని తన నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్ చేసేశాడు ఆర్జీవీ. ఇందులో చాలా బోల్డ్ గా నటించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపొయింది స్వీటీ అలియాస్ శ్రీరాపాక. ఆర్జీవీ పుణ్యమా అంటూ తర్వాత యాక్టర్ గా కూడా బిజీ అయింది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ సారి బిగ్‌బాస్‌‌ ఆఫర్ రావడంతో శ్రీ రాపాక కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. దీంతో ఆర్జీవీ తను పరిచయం చేసిన ఈ బ్యూటీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆర్జీవీ సపోర్ట్ తో శ్రీ రాపాకకి మరింత మంది ఫ్యాన్స్ తోడవ్వనున్నారు అని తెలుస్తుంది. ఆర్జీవీ ఫ్యాన్స్ శ్రీ రాపాకకి ఓట్లు వేస్తే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ అమ్మడికి. చూడాలి మరి ఏమవుతుందో.