RGV ట్వీట్: కండల పోటీలో మేనకోడలే గెలిచిందట

ఆర్జీవీ.. పబ్లిసిటీకి కొత్త దారులు వెతుక్కునే బాటసారి. చెప్పాలనుకునేది ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పి అందులోనే 2, 3 అర్థాలు ఉంచుతాడు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్నట్లు భారీగా ప్రచారం చేపడుతున్న వర్మ ఏదైనా కొత్త విషయం పోస్టు చేస్తే జనాల్లోకి బాణంలా దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో సంచలనాలు, వివాదాలు అన్నింటిలో వేలెట్టేసిన వర్మ ఏం చేసినా స్సెషలే.
ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను పోస్టు చేశాడు. తన మేనకోడలిని కాస్టూమ్ డిజైనర్‌గా చూడబోతున్నట్లు చెప్పాడు. ‘అద్భుతమైన టాలెంట్ ఉన్న మేనకోడలితో నా ఫొటో’ ‘నా మేనకోడలు శ్రావ్య వర్మ తన కండలతో నన్ను ఓడించేసింది’ ‘ఎలాగైతే శ్రావ్య వర్మ నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తానని ప్రామిస్ చేసింది’ అంటూ 3 ట్వీట్లు చేశాడు.
అయితే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని లాభదాయకంగా వ్యవహరించే వర్మ ఈ పోస్టులు ఎందుకు పెట్టినట్లు? తన మేనకోడలు శ్రావ్య వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకేనా? లేదా తనకీ ఓ మేనకోడలు ఉందన్న విషయం అందరికీ తెలియాలనా? ఏమో ఏం పెట్టినా ప్రశంసలు, విమర్శలు అందుకునే వర్మ పెట్టిన ఫొటో పరమార్థం తనకే తెలియాలి.
My niece @shravyavarma checking out her bicep with my tricep and she won??? pic.twitter.com/3Qh3Anf3di
— Ram Gopal Varma (@RGVzoomin) March 5, 2019
But me and @shravyavarma eventually made up and she promised to apply her costume designing talent on dear old ME! pic.twitter.com/aLXGXETMJJ
— Ram Gopal Varma (@RGVzoomin) March 5, 2019