సుశాంత్ సోదరిపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి

  • Published By: vamsi ,Published On : September 7, 2020 / 04:05 PM IST
సుశాంత్ సోదరిపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి

Updated On : September 7, 2020 / 4:29 PM IST

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. లేటెస్ట్‌గా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ మరియు ఇతరులపై రియా చక్రవర్తి ఫోర్జిరీ కేసు నమోదు చేశారు. నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారంటూ ఫోర్జరీ, ఎన్‌డిపిఎస్ చట్టం, టెలి మెడిసిన్ ప్రాక్టీస్ చట్టం కింద రియా కేసు నమోదు చేసింది.



జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి, సుశాంత్ కుటుంబం రియా చక్రవర్తిపై రకరకాలుగా ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు తరువాత, సిబిఐ, ఈడి మరియు ఎన్‌సిబి ఈ కేసును విచారిస్తున్నాయి.
https://10tv.in/sushant-singh-rajput-case-rhea-chakrabortys-father-indrajeet-chakraborty-summoned-again-by-the-enforcement-directorate/
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని ఈ రోజు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మొదటిసారి రియాను ఎన్‌సిబి ఆదివారం సుమారు ఆరు గంటలు ప్రశ్నించారు. రియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఇంతకుముందు ప్రశ్నించాయి.



ప్రియాంక సింగ్ ఇచ్చిన అదే ప్రిస్క్రిప్షన్‌పై సుశాంత్ మరియు రియా మధ్య గొడవ జరిగిందని రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషింద్ వాదిస్తున్నారు.