Rihanna : వామ్మో.. రిహన్న ఒక్క పర్ఫార్మెన్స్‌కి.. అంబానీ అన్ని కోట్లు ఇచ్చాడా?

అనంత్ అంబానీ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహన్న దాదాపు గంట సేపు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రిహన్న పర్ఫార్మెన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rihanna : వామ్మో.. రిహన్న ఒక్క పర్ఫార్మెన్స్‌కి.. అంబానీ అన్ని కోట్లు ఇచ్చాడా?

Rihanna Performance in Anant Radhika Pre Wedding Rihanna Remuneration goes Viral

Rihanna : ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లో గత మూడు రోజులుగా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి దేశ విదేశాల నుంచి ఎంతోమంది బిజినెస్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిన్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వరల్డ్ పాపులర్ పాప్ సింగర్ రిహన్న కూడా ఇండియాకు వచ్చి అంబానీ ఇంట పెళ్లి వేడుకకు పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

రిహన్నకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలో కూడా రిహన్న సాంగ్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. రిహన్న ఇండియాకి వస్తుంది, అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలియగానే చాలా మంది ఆమె కోసం ఎదురుచూసారు. ఇక అనంత్ అంబానీ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహన్న దాదాపు గంట సేపు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రిహన్న పర్ఫార్మెన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రిహన్నకు ఇచ్చిన రెమ్యునరేషన్ టాక్ విని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Save The Tigers 2 : ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ చూశారా? ఈ సారి మరింత కామెడీ..

రిహన్నకు దాదాపు 9 మిలియన్ డాలర్స్ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 74 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెమ్యునరేషన్ విని అంతా షాక్ అవుతున్నారు. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంబానీ ఈ పెళ్లి వేడుకలకు దాదాపు 1000 కోట్లు ఖర్చుపెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.