Rithu Chowdary Comments on Jabardasth Show
Rithu Chowdary : జబర్దస్త్ షోలోకి ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి వెళ్లారు. కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతే కొంతమంది మాత్రం పలు కారణాలతో బయటకు వెళ్లిపోయారు. కానీ జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు నవ్వించి ఫేమ్ తెచ్చుకొని పాపులర్ అయ్యారు పలువురు ఆర్టిస్టిలు. అందులో రీతూ చౌదరి ఒకరు.
సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరికి బయట జనాల్లో పాపులారిటీ జబర్దస్త్ తోనే వచ్చింది. జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ లో కొన్ని రోజులు చేసింది. అప్పుడు జబర్దస్త్ లో అజర్ అనే నటుడితో లవ్ ట్రాక్ కూడా స్కిట్స్ కోసం బాగా నటించింది. కానీ కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ షోకి రావట్లేదు రీతూ చౌదరి.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ ఎందుకు మానేసావు, మళ్ళీ చేస్తావా అని అడగ్గా రీతూ చౌదరి సమాధానమిస్తూ.. హైపర్ ఆది ఉంటేనే జబర్దస్త్ చేస్తాను. అతను ఉంటేనే నాకు ఫన్. అతనితోనే చేస్తాను. జబర్దస్త్ లో నాకు రామ్ ప్రసాద్ మొదట పరిచయం అయ్యాడు. ఆది టీమ్ లో కొత్త అమ్మాయిలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు, అతనికి నేను చెప్తాను అని చెప్పాడు. రామ్ ప్రసాద్ చెప్పాక నేను ఆదికి కాల్ చేశాను. పిలిచాడు, అలా స్కిట్స్ లో కంటిన్యూ చేసాడు. హైపర్ ఆది వెళ్ళిపోయాక నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఆది పిలిస్తే వెళతాను. అజర్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అక్కడ స్కిట్స్ లో లవ్ ట్రాక్ చూపించిందంతా స్క్రిప్ట్ మాత్రమే అని తెలిపింది.
హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలు, వేరే షోలతో బిజీగా ఉండటంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. మరి ఆది మళ్ళీ జబర్దస్త్ కి వస్తాడో లేదో చూడాలి. ఆది వస్తే మళ్ళీ రీతూ చౌదరిని తీసుకుంటాడో లేదో.
Also Read : Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్ వచ్చేసింది.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ హారర్ సినిమా..