Rithu Chowdary : బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన రీతూ చౌదరి? పెళ్లి చేసుకోవద్దు అంటూ పోస్ట్..

కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. దీంతో ఆ వార్త బాగా వైరల్ అయింది.

Rithu Chowdary : బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన రీతూ చౌదరి? పెళ్లి చేసుకోవద్దు అంటూ పోస్ట్..

Rithu Chowdary said breakup to her Boy Friend and says dont marry news goes viral

Updated On : July 29, 2023 / 11:52 AM IST

Rithu Chowdary Boy Friend : సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రీల్స్, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. దీంతో ఆ వార్త బాగా వైరల్ అయింది. అతను హైదరాబాద్ కి చెందిన ఓ పొలిటీషియన్ ఫ్యామిలీ అబ్బాయి అని, బిజినెస్ మెన్ అని సమాచారం.

అయితే ఇప్పుడు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్నాళ్ల క్రితం రీతూ తండ్రి చనిపోయారు. అప్పట్నుంచి బాధలో ఉన్న రీతూ ఇటీవలే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన రీతూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే చాలా ప్రశ్నలు వచ్చినా లవ్, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

Dulquer Salmaan : రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా సినిమా.. అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా దుల్కర్..

రీతూ చౌదరి.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ ఇలా అన్ని ప్రేమ, పెళ్లి గురించి సమాధానాలు ఇచ్చింది రీతూ. అలాగే శ్రీకాంత్ తో మాట్లాడుతున్నారా అని అడిగితే.. సారీ.. త్వరలో చెప్తాను అని తెలిపింది. దీంతో రీతూ చౌదరి ఫియాన్సీకి బ్రేకప్ చెప్పింది, వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు అని క్లారిటీ వచ్చేసిందంటున్నారు నెటిజన్లు. మరి ఎందుకు వీరిద్దరూ విడిపోయారో వాళ్ళకే తెలియాలి. దీనిపై రీతూ మళ్ళీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. రీతూ ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, రీల్స్ తో హల్ చల్ చేస్తుంది.