హెల్ప్ కోసం ఫస్ట్ ఫోన్ కాల్ రోజాకే.. రియాక్షన్ విని చెమటలు పట్టాయి..

రైడింగ్‌లో పట్టుబడ్డగానే రోజాకు కాల్ చేసిన జబర్దస్త్ నటులు ఆమె రియాక్షన్ విని షాక్ అయ్యారు..

  • Published By: sekhar ,Published On : March 6, 2020 / 01:48 PM IST
హెల్ప్ కోసం ఫస్ట్ ఫోన్ కాల్ రోజాకే.. రియాక్షన్ విని చెమటలు పట్టాయి..

Updated On : March 6, 2020 / 1:48 PM IST

రైడింగ్‌లో పట్టుబడ్డగానే రోజాకు కాల్ చేసిన జబర్దస్త్ నటులు ఆమె రియాక్షన్ విని షాక్ అయ్యారు..

రైడింగ్‌లో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి పోలీసుల చేత ఆ షో జడ్జి, ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 4వ తేది విశాఖపట్నం మాధవదారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు జరుపగా జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పరదేశి వీడియోలు తీయోద్దంటూ, తమను వదిలేయమంటూ పోలీసులను కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమాలాడు. చివరకు జబర్దస్త్ జడ్జి రోజా చేత చెప్పిస్తే వింటారోమోనని పోలీసుల చేత ఆమెకు కాల్ చేయించగా..

‘ఇలాంటి విషయాల్లో తాను ఎటువంటి సహాయం చేయబోనని.. పలుకుబడి చేత ఇలాంటి వాళ్లకి హెల్ప్ చేస్తే.. అది అలుసుగా తీసుకుంటారు.. ఒక మహిళగా ఇలాంటి పనులుచేసే వారిని నేను ప్రోత్సహించను.. చట్టం ఎవరి చుట్టమూ కాదు.. మీ పద్ధతిలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి ’ అంటూ రోజా పోలీసులకు చెప్పారని సమాచారం. 

ఇదిలా ఉంటే జబర్దస్త్ షోను నిర్మిస్తున్న మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై.లి) వారు టీమ్ లీడర్స్ మరియు టీమ్ మెంబర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే వార్త వినబడుతోంది. చాలాకాలంగా తమ షో పై పలు కాంట్రవర్సీలు రావడం, మిగతా చానెల్స్‌తో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి వివాదాల్లో ఇరుక్కుంటే జబర్దస్త్ ప్రతిష్టకే భంగం వాటిల్లే అవకాశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలేస్తే జబర్దస్త్ నుంచి తప్పించడానికి వెనకాడబోమని మల్లెమాల యాజమాన్యం వార్నింగ్ ఇచ్చిందనే వార్త మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

Read Also : రోజా – శేఖర్ మాస్టర్.. స్టెప్స్ అదరగొట్టేశారుగా!