Roja : జగన్‌ – చిరు భేటీ‌పై స్పందించిన రోజా

రోజా మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏం చేసినా ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తుంటాయి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన పాఠశాల, కళాశాలల ఫీజులు............

Roja :  ఏపీలో సినీ టికెట్ల ధరలపై, థియేటర్ల సమస్యలపై జరుగుతున్న చర్చలు తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరుపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ సినీ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే కొత్త జీవో రిలీజ్ చేస్తారని చెప్పారన్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి భేటీపై సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. బంధువులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకునేందుకు కడపలోని శెట్టిపాలెం వచ్చిన రోజా ఈ విషయంపై మాట్లాడారు.

Chiaranjeevi : జగన్‌తో చిరు భేటీ‌పై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

రోజా మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏం చేసినా ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తుంటాయి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన పాఠశాల, కళాశాలల ఫీజులు తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అన్నారు. కరోనా పేరుతో విపరీతంగా దోచుకుంటున్నారని ఆస్పత్రి వర్గాల్ని కంట్రోల్‌ చేసినప్పుడూ విమర్శించారు. ఇప్పుడు సినిమా టికెట్‌ ధరల విషయంలోనూ అలానే అంటున్నారు. ప్రజలంతా సౌకర్యవంతంగా జీవించేలా ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం, చిరంజీవి భేటీ అవటం శుభపరిణామం. అలా ఎవరైనా సీఎంను కలిసి సాధకబాధకాలు వివరించాలి. అంతే కానీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడకూడదు. సీఎంకి ఉన్న బిజీ షెడ్యూలో చలన చిత్ర పరిశ్రమ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజాసమస్యలు తీర్చేందుకు ముందుకెళ్తున్నాడే తప్ప ఎవరి మీదా కక్ష సాధించేందుకు కాదు. చిత్ర పరిశ్రమ వాళ్లు చెప్పింది సీఎంకు న్యాయమనిపిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది’’ అని రోజా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు