Chiaranjeevi : జగన్‌తో చిరు భేటీ‌పై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

TFCC వైస్ ప్రెసిడెండ్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. ''ఆయన తనకున్న పరిచయాలతో ఆయన్ని కలవగలిగారు. చిరంజీవి, ఏపీ సీఎం భేటి అవుతున్నారనే విషయం మాకు................

Chiaranjeevi :  జగన్‌తో చిరు భేటీ‌పై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

Tfcc

Chiaranjeevi :   ఏపీలో సినీ టికెట్ల ధరలపై, థియేటర్ల సమస్యలపై గత కొన్ని రోజులుగా వాడి వేడిగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరుపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ సినీ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే కొత్త జీవో రిలీజ్ చేస్తారని చెప్పారన్నారు.

అయితే చిరంజీవి ఏపీ సీఎంని కలవడంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు స్పందించారు. TFCC వైస్ ప్రెసిడెండ్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. ”ఆయన తనకున్న పరిచయాలతో ఆయన్ని కలవగలిగారు. చిరంజీవి, ఏపీ సీఎం భేటి అవుతున్నారనే విషయం మాకు తెలియదు. ఆయన ఏపీ సీఎంను కలిసే ముందు తెలుగు ఫిల్మ్ చాంబర్ వాళ్లను సంప్రదిస్తే బాగుండేది. చిరంజీవి తన సినిమా కోసం జగన్‌ను కలిసారా లేదా ఇండస్ట్రీ సమస్యల గురించి వెళ్లి మీట్ అయ్యారా అనేది మాకు తెలియదు. ఇండస్ట్రీ బాగు కోసం ఏ నిర్ణయం తీసుకున్న మాకు సమ్మతమే” అని అన్నారు.

Sukumar : వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటిపై నిర్మాతల కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరూ ఆర్గనైజేషన్ కన్నా పెద్దవాళ్లు కాదు. సినీ రంగంలోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆర్గనైజేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఒకప్పటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు కూడా తాము ఇండస్ట్రీ పెద్దలని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇండస్ట్రీకి నిర్మాతలే పెద్దదిక్కు. వాళ్లే ఇండస్ట్రీలోని అందరితో సమన్వయంగా ఉండేది. మాతో ఆయన ఏమి చర్చించలేదు. చిరంజీవి ఆయన పర్సనల్ ఎజెండా మీద వెళ్లి కలిసినట్టు అనిపిస్తుంది” అని అన్నారు.