అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడి.. ‘‘పెళ్లి సందD’’..

  • Published By: sekhar ,Published On : October 26, 2020 / 08:59 PM IST
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడి.. ‘‘పెళ్లి సందD’’..

Updated On : October 26, 2020 / 9:07 PM IST

PelliSandaD – Roshan: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిన్న విరామం తర్వాత తన సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైన ‘పెళ్లిసందడి’ సినిమా చేయబోతున్నానని చెబుతూ.. ‘#PelliSandadi… మళ్ళీ మొదలవ్వబోతుంది…. తారాగణం త్వరలో…’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్ నటనకు సంబంధించిన పూర్తి శిక్షణ తీసుకుని చాలా బాగా మేకోవర్ అయ్యాడు. ‘పెళ్లిసందD’ లో రోషన్ హీరోగా నటిస్తున్నడని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. రోషన్ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ శ్రీకాంత్ ట్వీట్ చేశారు.

PelliSandaD

తండ్రి కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాను అదే పేరుతో అదే దర్శకుడు ఆ హీరో తనయుడితో 24 సంవత్సరాల తర్వాత తెరకెక్కించడం విశేషం.
‘పెళ్లిసందడి’ శ్రీకాంత్‌కు ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. కీరవాణి పాటలతో ఈ మూవీ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.