కమాన్, ఏ సెంటర్‌కెళ్ళి కొట్టుకుందాం? 27 ఏళ్ళ రౌడీ ఇన్‌స్పెక్టర్
బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో, విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై టి.త్రివిక్రమరావు నిర్మించిన మాస్ ఎంటర్‌టైనర్ రౌడీ ఇన్‌స్పెక్టర్ 1992 మే 7న విడుదలైంది. 2019 మే 7నాటికి ఈ చిత్రం 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..

బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో, విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై టి.త్రివిక్రమరావు నిర్మించిన మాస్ ఎంటర్‌టైనర్ రౌడీ ఇన్‌స్పెక్టర్ 1992 మే 7న విడుదలైంది. 2019 మే 7నాటికి ఈ చిత్రం 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..
రౌడీ ఇన్‌స్పెక్టర్.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగు సినిమా గత రికార్డులన్నిటినీ తుడిచేసి, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మాస్ స్టామినా ఏంటో చూపించింది. లారీ డ్రైవర్ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో, విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై టి.త్రివిక్రమరావు నిర్మించిన మాస్ ఎంటర్‌టైనర్ రౌడీ ఇన్‌స్పెక్టర్ 1992 మే 7న విడుదలైంది. 2019 మే 7నాటికి ఈ చిత్రం 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
ఇన్‌స్పెక్టర్ రామరాజుగా బాలయ్య నటన అద్భుతం.. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ, విజయశాంతిల కెమిస్ట్రీ అదిరిపోయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య విజృంభించాడు. సెంటర్స్ పరంగానూ, కలెక్షన్‌ల పరంగానూ రికార్డ్ క్రియేట్ చేసి, బాలయ్యని బాక్సాఫీస్ బొనాంజాగా నిలబెట్టింది. తమిళ్, హిందీలో డబ్ చేస్తే అక్కడా సత్తా చాటిందీ చిత్రం..
బప్పీ లహరి కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకలోకాన్ని ఒక ఊపు ఊపాయి. అరె ఓ సాంబ, టక్కు టమారం బండి, డిక్కీ డిక్కీ, నీలాల నింగి, చిటపట చినుకులు, ఓ పాపాయో.. పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఏ.ఆంజనేయ ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాసారు. భువన చంద్ర లిరిక్స్ రాయగా, ఎస్పీబాలు, చిత్ర పాడారు. వి.ఎస్.ఆర్.స్వామి ఫోటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. బాలయ్య స్టామినాని బాక్సాఫీస్‌కి చాటి చెప్పిన రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమా.. నందమూరి అభిమానులకు స్పెషల్ ఫిలింగా, బాలయ్య కెరీర్‌లో పవర్ ఫుల్ ఫిలింగా నిలిచిపోయింది.
వాచ్, అరె ఓ సాంబ సాంగ్..