Rrr
RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చూసుకొనే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాకి మరింత పగడ్బంధీగా ప్రమోషన్లు ఏర్పాటు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయారు.
RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?
మరోవైపు ఇంకా ఇంకా నేషనల్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా జక్కన్న గీసిన కొత్త స్కెచ్.. నార్త్ మేకర్ మతి పోగొడుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుండి ఖండాంతరాల వరకు ఆర్ఆర్ఆర్ కేజ్ ఆకాశమే అన్నట్లుగా మారిపోయింది. నార్త్ రాష్ట్రాలలో కొంత మేర ప్రీరిలీజ్ బుకింగ్స్ నెమ్మదిగా జరుగుతున్నా.. ఇటు తెలుగు రాష్ట్రాలు, దక్షణాది రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ప్రీ రిలీజ్ బుకింగ్స్ దుమ్మురేపుతోంది. ఇతర దేశాలలో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి తగ్గట్లే మేకర్స్ అక్కడ భారీగా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?
ఒక్క ఆస్టేలియాకి సంబంధించే గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్ గా ఆర్ఆర్ఆర్ అవుతున్నట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ రివీల్ చేశారు. రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఆస్ట్రేలియాలో డిస్టిబ్యూట్ చేస్తుండగా.. అక్కడ టోటల్ థియేటర్స్ ఫైనల్ లిస్ట్ ప్రకటించారు. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు దక్షణాది ప్రేక్షకులు అధికంగా ఉండే దేశాలలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఓ లెవెల్ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
All set for a Biggest Ever Release for any Indian Film in Australia Region. @Radhakrishnaen9 @MoviesTolly #RRR Final list of theatres!🔥🔥🔥🌊🌊🌊 @RRRMovie @DVVMovies @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 @ajaydevgn @aliaa08 @PharsFilm @HoytsNZ @EVENTCinemasNZ pic.twitter.com/gwsL4y25Ex
— Radhakrishna Ents (@Radhakrishnaen9) March 23, 2022