RRR writer: ఆర్ఆర్ఆర్ అయింది.. ఇక బజరంగీ భాయ్‌జాన్ 2

సల్మాన్ ఖాన్ కెరీర్ లో బజరంగీ భాయ్‌జాన్ సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. కథలో అంత జీవం ఉంటుంది. గతంలో సల్మాన్ చేసిన కమర్షియల్ ప్రాజెక్టులన్నింటి కంటే ఈ సినిమానే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది.

RRR writer: ఆర్ఆర్ఆర్ అయింది.. ఇక బజరంగీ భాయ్‌జాన్ 2

Rrr Bajrangi Bhaijaan

Updated On : July 19, 2021 / 11:24 AM IST

RRR writer: సల్మాన్ ఖాన్ కెరీర్ లో బజరంగీ భాయ్‌జాన్ సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. కథలో అంత జీవం ఉంటుంది. గతంలో సల్మాన్ చేసిన కమర్షియల్ ప్రాజెక్టులన్నింటి కంటే ఈ సినిమానే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. 2015లో రిలీజ్ అయి బాక్సాఫీస్ గా హిట్ గా నిలిచిన సినిమాకు బాహుబలి రచయిత విజేయంద్ర ప్రసాద్ కలం కదిపారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్.. బజరంగీ భాయ్ జాన్ కోసం ట్రై చేస్తున్నట్లు వెల్లడించారు. చివరిసారిగా సల్మాన్ ను కలిసినప్పుడు సినిమా సీక్వెల్ చేద్దామనుకుంటున్నట్లు చర్చించాడట. అనుకున్నట్లుగానే అతను కూడా ఇంటరెస్ట్ చూపించాడని.. అందుకే ఈ కథను డెవలప్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఈ ఐడియా ముందుకెళ్లడానికి మంచి ఆయుధం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ఈ విషక్ష్ం సల్లూ భాయ్ ఫ్యాన్స్ కు క్రేజ్ పుట్టించడం ఖాయమే. సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బజరంగీ భాయ్ జాన్ మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటు కరీనా కపూర్, హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్దిఖీలు నటించగా కబీర్ ఖాన్ డైరక్ట్ చేశారు.