RRR: ఎన్టీఆర్ గర్జన కోసం ఎదురుచూపుల్లో ఫ్యాన్స్

సినిమా సంబరాలు మొదలయ్యాయి. చిన్న సినిమాలే హడావుడి చేసేస్తుంటే మెగా దర్శకత్వంలో రెడీ అవుతున్న.. మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాపై ఒక్క అప్‌డేట్ దొరికినా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

RRR: ఎన్టీఆర్ గర్జన కోసం ఎదురుచూపుల్లో ఫ్యాన్స్

Rrr Making Video Ntr Fans Waiting

Updated On : July 14, 2021 / 9:57 AM IST

RRR: సినిమా సంబరాలు మొదలయ్యాయి. చిన్న సినిమాలే హడావుడి చేసేస్తుంటే మెగా దర్శకత్వంలో రెడీ అవుతున్న.. మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాపై ఒక్క అప్‌డేట్ దొరికినా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నెలల తరబడి ప్రతీ అప్‌డేట్ ను పండుగలా జరుపుకుంటున్న అభిమానులకు ఆర్ఆర్ఆర్ నుంచి సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ కానుందనేది సూపర్ స్పెషలే.

ఎన్టీఆర్ అభిమానులైతే #RoarOfNTRRROnJuly15 అనే హ్యాష్ ట్యాగ్ తో లక్షా 70వేలకు పైగా రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. 2016లో విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా తర్వాత.. ఇన్నేళ్లకు కనువిందు చేయబోతున్నారు జూ. ఎన్టీఆర్. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను కంప్లీట్ చేసిన టీం మేకింగ్ వీడియోను విడుదల చేయాలని ప్లాన్ చేసింది.

జులై 15న కనులవిందు చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యారు. ఇక తారక్ వెండితెరపై కనిపించేందుకు ముస్తాబైన సినిమా గురించి వర్కింగ్ స్టిల్స్ కోసం మరి కొద్ది గంటల పాటు నిరీక్షించాల్సిందే. అభిమానులు ఈ నిరీక్షణను సైతం సెలబ్రేట్ చేసుకుంటూ #RoarOfNTRRROnJuly15 హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేసి @tarak9999ను ట్యాగ్ చేస్తున్నారు.