RRR Movie : చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్

‘ఆర్ఆర్ఆర్’ కోలీవుడ్ ప్రమోషన్స్.. చెన్నైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

RRR Movie : చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్

Rrr Movie Pre Release Event

Updated On : December 25, 2021 / 4:04 PM IST

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RRR Movie : మళ్లీ వాయిదా?

గతకొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్‌గా ప్రమోషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కపిల్ శర్మ షో తో పాటు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ షో లోనూ సందడి చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం.

Films Re-Shoot: రీ షూట్.. ప్యాకప్ చెప్పిన సినిమాలకు మళ్ళీ ప్యాచప్!

తర్వాత కోలీవుడ్ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27 సోమవారం చెన్నైలోని చెన్నై ట్రేడ్ సెంటర్‌లో భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు తమిళ ఇండస్ట్రీ నుండి పలువురు అతిథులుగా హాజరవబోతున్నారని సమాచారం. తమిళనాట ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!