RRR దీపావళి సర్‌ప్రైజ్ వచ్చేసింది!

  • Publish Date - November 13, 2020 / 12:26 PM IST

RRR Diwali: యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘#RRR- రౌద్రం రణం రుధిరం’’..


అక్టోబర్ 22న కొమరం భీం 119వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ ఫర్ భీమ్ టీజర్‌కు భారీ స్పందన లభించింది. దీపావళి సందర్భంగా ప్రేక్షకాభిమానులకు ఆర్ఆర్ఆర్ టీం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.


దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ తారక్, చెర్రీ ట్రెడిషనల్ వేర్‌లో చిరునవ్వులు చిందిస్తున్న పిక్ రిలీజ్ చేశారు. అలాగే వారితో జక్కన్న స్వీట్స్ తినిపిస్తున్న స్టిల్ కూడా వదిలారు. ఇద్దరు హీరోలకు ఒకే ఫ్రేంలో చూడడంతో ఫ్యాన్స్‌కు దివాళీ ఆనందం రెట్టింపుఅయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.