‘వాడి బాడీ బాక్సాఫీస్’.. తారక్.. లుక్ అదిరిందిగా!

NTR Photo Shoot: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఏడునెలల గ్యాప్ తర్వాత తారక్ RRR షూటింగులో పాల్గొంటున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ తర్వాత వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు జూనియర్.
హోం బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో అన్నయ్య కళ్యాణ్ రామ్, హారిక హాసిని చినబాబు నిర్మాణంలో త్రివిక్రమ్‌తో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా బాలీవుడ్ టాప్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని(Dabboo Ratnani) ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు తారక్.
షర్ట్ లేకుండా సాలిడ్ బాడీతో తారక్ లుక్ అదిరిపోయింది. ‘అరవింద సమేత’ కోసం షర్ట్ విప్పించి సిక్స్ ప్యాక్ చూపించిన త్రివిక్రమ్ మరోమారు తారక్‌ను సరికొత్త లుక్‌లో చూపించనున్నాడని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ యాడ్ షూట్‌కు సంబంధించిన పిక్స్, వీడియో వైరల్ అవగా.. ఇప్పుడీ ఫొటో ట్రెండ్ అవుతోంది.. తమ అభిమాన హీరోని ఇలా చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘వాడి బాడీ బాక్సాఫీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు ‘టెంపర్’ సినిమాలోనూ ఓ పాటలో ఇలాంటి బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు తారక్.