RRR : ‘నాటు నాటు’ పాటకి అన్ని కోట్లు ఖర్చు చేశాం.. నిర్మాత డీవివి!

రాజమౌళి తెరకెక్కించిన RRR 'నాటు నాటు' సాంగ్ కి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డుని అందుకున్నందుకు మూవీ టీంపై సినీ, రాజకీయ ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ తమ అనుభవాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నిర్మాత డీవివి దానయ్య..

RRR : ‘నాటు నాటు’ పాటకి అన్ని కోట్లు ఖర్చు చేశాం.. నిర్మాత డీవివి!

rrr producer says spent almost 20 crores for naatu naatu song

Updated On : January 12, 2023 / 10:35 AM IST

RRR : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించింది. ఎం ఎం కీరవాణి అందించిన ఈ సాంగ్ వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్ ని ఊర్రుతలుగించింది. ఒక భారతీయ సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావడం ఇదే మొదటిసారి.

Upasana : RRR సక్సెస్‌ని నా బేబీ కూడా ఎక్స్‌పిరెన్స్ చేస్తుంది.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్!

ఇక ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర యూనిట్ కూడా తమ అనుభవాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నిర్మాత డీవివి దానయ్య ఈ పాట గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘నాటు నాటు పాటని ఉక్రెయిన్ లో చిత్రీకరించాము. దాదాపు 20 రోజులు పాటు షూటింగ్ చేశాము. హీరోలతో పాటు ఈ సాంగ్ షూట్ లో రోజుకి రెండు వేల మంది పాల్గొన్నారు. ఈ పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ దాదాపు 30 రోజులు పాటు ప్రాక్టీస్ చేశారు’ అంటూ వెల్లడించాడు.

అంతేకాదు సినిమాలో ఈ ఒక్క పాట కోసమే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేశాడు. రాజమౌళి మీద నమ్మకంతోనే ఒక సాంగ్ కోసం అంత ఖర్చు చేశాము, ఇప్పుడు దాని ప్రతిఫలం చూస్తున్నాము అంటూ వెల్లడించాడు. కాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రేస్ లో బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీ నామినేషన్ లో నిలువగా, ‘నాటు నాటు’ సాంగ్ అవార్డుని కైవసం చేసుకొంది. అలాగే ఈ సాంగ్ ఆస్కార్ రేస్ లో కూడా నిలిచింది. ప్రస్తుతం ఓటర్ల కోసం ఈ సినిమాని చైనీస్ థియేటర్ లో ప్రదర్శన చేస్తుండగా.. విదేశీలు నాటు నాటు సాంగ్ వచ్చినప్పుడు స్క్రీన్ వద్దకి వెళ్లి డాన్స్ వేసి సందడి చేస్తున్నారు. దింతో ఈ పాట ఆస్కార్ కూడా గెలుచుకుంటుంది అంటున్నారు హాలీవుడ్ మీడియా ప్రతినిధులు.