RRR sets records at the Japanese box office
RRR: రాజమౌళి దర్శకత్వంలో ప్రీ ఇండిపెండెన్స్ కథాంశం తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం “ఆర్ఆర్ఆర్”. సినిమాలోని ఎన్టీఆర్ అండ్ చరణ్ నటనకు నటనకు ప్రశంసలు జల్లు కురుస్తుంది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ సాంకేతిక నిపుణులు వెండితెరపై జక్కన చేసిన మ్యాజిక్ కి ఫిదా అయ్యిపోతున్నారు.
Empire Magazine : RRRకి మరో గుర్తింపు.. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ లో RRR సినిమా గురించి..
ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జపాన్ లో ఇటీవల విడుదల చేయగా.. అక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాస్తుంది. మొదటి వారం కలెక్షన్స్ కు గాను.. ఈ చిత్రం దాదాపు $495,000 కలెక్ట్ చేసి జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారతీయ సినిమాల్లో మొదటిస్థానంలో నిలిచింది.
జాపనీస్ ఈ సినిమాపై చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియడం లేదు. తాజాగా ఈ సినిమా మరో ఘనతని కూడా సాధించింది. అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక 50వ సాటర్న్ అవార్డ్స్‌లో.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.