RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేస్తోంది..

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి థర్డ్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్..

RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేస్తోంది..

Janani Song

Updated On : November 22, 2021 / 6:36 PM IST

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. గత మూడేళ్లుగా RRR గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లకు, రామ్, భీమ్ ప్రోమోలకు, ‘దోస్తీ’, ‘నాటు నాటు’ పాటలకు ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటకు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ థర్డ్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 26న ‘ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథమ్’ పేరుతో ‘జనని’ అనే పాటను రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళం భాషల్లో ఈ సాంగ్ రానుంది. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.