చరణ్ ఛాలెంజ్ స్వీకరించిన RRR టీమ్

  • Published By: sekhar ,Published On : November 11, 2020 / 01:01 PM IST
చరణ్ ఛాలెంజ్ స్వీకరించిన RRR టీమ్

Updated On : November 11, 2020 / 3:30 PM IST

RRR Team Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన RRR మూవీ టీమ్ అందరూ తమ వంతుగా మొక్కలు నాటారు. రాజమౌళి, సెంథిల్ కుమార్ లతో సహా చిత్రబృందమంతా మొక్కలు నాటి.. ‘ఆచార్య’, ‘పుష్ప’, ‘రాధే శ్యామ్’ సినిమా సభ్యులంతా కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.