Ruhani Sharma : లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘HER’ తో రాబోతున్న రుహాణి శర్మ.. సెన్సార్ పూర్తి.. జూలై 21న రిలీజ్

HER మూవీ చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు.

Ruhani Sharma : లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘HER’ తో రాబోతున్న రుహాణి శర్మ.. సెన్సార్ పూర్తి.. జూలై 21న రిలీజ్

Ruhani Sharma lady oriented Movie HER completed Censor and releasing by Suresh Productions on July 21st

Updated On : July 19, 2023 / 12:30 PM IST

Ruhani Sharma HER Movie : యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ (Ruhani Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా HER. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి.. ఇప్పుడు మరో డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

HER మూవీ చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రమోషన్స్ చేపడుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మేకర్స్.

Lavanya Niharika : వదిన మరదళ్ల స్పెషల్ సెల్ఫీలు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లావణ్య, నిహారిక..

చిత్ర ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ తీసుకొస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. HER ఫైనల్ కాపీ చూసిన టాలీవుడ్ బడా బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరించారు. పవన్ బాణీలు కట్టారు. ఈ సినిమా రుహాణి శర్మ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని, భారీ ప్రేక్షకాదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.