Rukshar Dhillon : రుక్సార్ థిల్లాన్ మరో పోస్ట్.. ‘ఫొటోకు పోజివ్వడం నా ఎంపిక.. బలవంతంగా పోజ్ చేయించడం..’
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Rukshar Dhillon social media post viral on International Womens Day
అసౌకర్యంగా ఉన్న సమయంలో కొందరు హీరోయిన్ల ఫోటోలని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
పోజ్ ఇవ్వడం నా ఎంపిక, బలవంతంగా పోజ్ చేయించడం నా ఎంపిక కాదు.. ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరించడం నా ఎంపిక. నా దుస్తులపై తీర్పు వేయడం. నా ఎంపిక కాదంటూ వ్యాఖ్యలు చేసింది.
‘సాహసంతో ఉండడం. నా ఎంపిక భయంతో చతికిలపడమని చెప్పడం. నా ఎంపిక కాదు.
ప్రేమించడం. నా ఎంపిక ఎప్పుడు. ఎవరిని ప్రేమించాలో చెప్పడం. నా ఎంపిక కాదు.
నా కోసం నేను మాట్లాడడం. నా ఎంపిక నిజం చెప్పడాన్ని భయపడడం. నా ఎంపిక కాదు.
పోజ్ ఇవ్వడం. నా ఎంపిక బలవంతంగా పోజ్ చేయించడం. నా ఎంపిక కాదు.
ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరిచడం. నా ఎంపిక నాదుస్తులపై తీర్పు వేయడం. నా ఎంపిక కాదు.
ఆత్మవిశ్వాసంతో ఉండడం. నా ఎంపిక నేను ఎత్తుగా ఎదుగుతానని భయపడడం. నా ఎంపిక కాదు.
అందరినీ సమానంగా గౌరవించడం. నా ఎంపిక స్త్రీగా నన్ను అసమానంగా చూడడం. నా ఎంపిక కాదు.
స్వేచ్చా పక్షిలా జీవించడం. నా ఎంపిక నన్ను ఖైదు చేయమని చెప్పడం. నా ఎంపిక కాదు.
నేను ఒక స్త్రీ. ఇది నా ఎంపిక. నీది కాదు.’
హ్యాపీ ఉమెన్స్ డే!
అంటూ రుక్సాన్ రుక్సర్ థిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
Happy Women’s Day♥️#mychoice #womensday #rukshardhillon pic.twitter.com/ygqmdJ5RDS
— Rukshar Dhillon (@RuksharDhillon) March 8, 2025
Jr NTR : మూడు పండుగలకు మూడు సినిమాలు.. ఫుల్ స్పీడ్‌లో జూ.ఎన్టీఆర్
దిల్ రూబా ట్రైలర్ ఈవెంట్‌లో..
దిల్ రూబా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. తాను సౌకర్యంగా లేను అని చెప్పినా కొంతమంది ఫోటోలు తీస్తున్నారని మండిపడింది. వద్దని చెప్పినా ఫొటోలు తీయడం రైటా? తప్పా? ఫోటోలు తీయొద్దు అని ప్రేమగా చెప్పినా వినిపించుకోలేదు. వాళ్ళ పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదు అని చెప్పింది.