Lyuba Palm : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రష్యా భామ..

రష్యాలో పుట్టి పెరిగిన లియుబా పామ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది.

Lyuba Palm : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రష్యా భామ..

Russian Actress Lyuba Palm entry into Tollywood with Horror Movie Ninnu Vadalanu

Updated On : July 3, 2024 / 7:20 AM IST

Lyuba Palm : రష్యా భామ లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘నిన్ను వదలను’. అమెరికాకు చెందిన UVT హాలీవుడ్ స్టూడియో, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అశోక్ కుల్లర్ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో నిన్ను వదలను సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Bujji in Bhimavaram : ఇదెక్కడి మాస్ రా బాబు.. ప్రభాస్ రేంజ్‌లో భీమవరంలో ‘బుజ్జి’ హవా.. బుజ్జితో ఉండి ఎమ్మెల్యే..

రష్యాలో పుట్టి పెరిగిన లియుబా పామ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఆమె సింగర్, నిర్మాత కూడా. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలిం కి నిర్మాతగా మరియు లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్ కి రైటర్, నిర్మాత గా వ్యవహరించింది. ఇప్పుడు తెలుగులో నిన్ను వదలను అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో నటిగా రాబోతుంది.

View this post on Instagram

A post shared by Lyuba Palm (@lyubapalm)