Ajay Bhupathi : పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్న RX100 డైరెక్టర్ అజయ్ భూపతి..

'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు.

Ajay Bhupathi : పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్న RX100 డైరెక్టర్ అజయ్ భూపతి..

Ajay Bhupathi

Updated On : February 28, 2023 / 12:58 PM IST

Ajay Bhupathi : ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. సంచలనం మాత్రమే కాదు తెలుగులో ఒక కొత్త ట్రెండుకు కూడా శ్రీకారం చుట్టాడు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో శర్వానంద్, సిద్దార్ద్ లతో మల్టీస్టార్రర్ తెరకెక్కించే ఛాన్స్ అందుకున్నాడు. మహాసముద్రం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగం చేసిన అజయ్ భూపతి.. సక్సెస్ అందుకోలేక పోయాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హాయ్ కొట్టాలని తానే నిర్మాతగా మారి, మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

Siddharth-Aditi : మరోసారి ప్రేమ జంట వైరల్.. ట్రెండింగ్ సాంగ్‌కి కలిసి రీల్ చేసిన సిద్దార్థ్-అదితి

‘మంగళవారం’ అనే డిఫరెంట్ టైటిల్ ని ఖరారు చేశారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రమిది. ఇక ఈ ఈవెంట్ లో దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ”కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. ‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే” అని అన్నారు.

నిర్మాతలు స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ మాట్లాడుతూ ”మాది పాన్ ఇండియా సినిమా కాదు, సౌత్ ఇండియన్ సినిమా. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి ఆడియన్స్‌ను ఎలా సర్‌ప్రైజ్ చేశారో, ఈ సినిమాతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ మరియు కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల ప్రారంభించాం. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.