Game Changer : ఇండియన్ 2 నుంచి గేమ్ చెంజర్కి శంకర్ షిఫ్ట్.. అప్పుడే క్లైమాక్స్ షూట్?
ఇండియన్ 2 షెడ్యూల్ పూర్తి చేసిన శంకర్ రామ్ చరణ్ గేమ్ చెంజర్ క్లైమాక్స్ షూట్ తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు.

S Shankar Ram Charan Game Changer climax shoot starts soon
Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలయికలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చెంజర్. అయితే శంకర్ ఈ మూవీతో పాటు ఇండియన్ 2 (Indian 2) ని కూడా తెరకెక్కిస్తున్నాడు. 1996 లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడుకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. చరణ్ సినిమా కంటే ముందు కమల్ హాసన్ సినిమానే మొదలు పెట్టాడు శంకర్. కానీ మధ్యలో ఇండియన్ 2 ఆగిపోవడంతో RC15 ని స్టార్ట్ చేశాడు. తరువాత ఇండియన్ 2 కి కూడా లైన్ క్లియర్ అవ్వడంతో కొన్ని రోజులు RC15 చిత్రం, కొన్ని రోజులు ఇండియన్ చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు.
Ram Charan : చిరుత కాదు చిట్టెలుక.. రామ్ చరణ్ గురించి బలగం ఫేమ్ నటుడు కామెంట్స్..
ఇటీవలే సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కోసం వెళ్లిన ఇండియన్ 2 టీం అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. దీంతో శంకర్ గేమ్ చెంజర్ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో శంకర్.. చరణ్ తో క్లైమాక్స్ షూట్ చిత్రీకరించబోతున్నట్లు తెలియజేశాడు. మే నెల వరకు ఈ షెడ్యూల్ షూట్ జరగనుంది. ఆ తరువాత మళ్ళీ ఇండియన్ 2 సెట్స్ లోకి చేంజ్ అవుతాను అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. కాగా గేమ్ చెంజర్ షూటింగ్ ఇప్పటి వరకు 70 శాతం పూర్తి అయ్యినట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు తెలియజేశాడు. క్లైమాక్స్ షూట్ పూర్తి అయితే ఆల్మోస్ట్ చిత్రీకరణ కంప్లీట్ అయ్యినట్లే తెలుస్తుంది.
Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
ఇక మిగిలిన బ్యాలన్స్ షూట్ వచ్చి ఆగష్టులోపు పూర్తి చేయనున్నట్లు దిల్ రాజు తెలియజేశాడు. దసరా టైంలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Thank you for this power-packed Schedule @ikamalhaasan sir ? See you again in May! Will be moving from #Indian2Gamechanger for the climax!!! pic.twitter.com/J7WGmzCuxb
— Shankar Shanmugham (@shankarshanmugh) April 18, 2023