అలియా ఎఫెక్ట్: ట్రైలర్‌కు భారీ Dislikes..

  • Published By: sekhar ,Published On : August 12, 2020 / 03:16 PM IST
అలియా ఎఫెక్ట్: ట్రైలర్‌కు భారీ Dislikes..

Updated On : August 12, 2020 / 3:16 PM IST

సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా భట్ ప్రదాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సడక్ 2’. 1991లో సంజయ్ దత్, పూజా భట్ జంటగా మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సడక్’కు ఇది సీక్వెల్‌గా ‘సడక్ 2’ రూపొందింది. ఈ సీక్వెల్‌కు కూడా మహేశ్ భట్ దర్శకత్వం వహించారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అలియా భట్ పుణ్యమా అని ఈ ట్రైలర్‌కు Dislikes బీభత్సంగా వస్తున్నాయి. వాస్తవానికి ట్రైలర్ ఏమంత బ్యాడ్‌గా లేదు కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారంతో బాలీవుడ్‌లో నెపోటిజం అంశం మరోసారి తెరమీదకొచ్చింది. అప్పటినుంచి బ్యాగ్రౌండ్ ఉన్న పలువురు దర్శక నిర్మాతలు, కథానాయికలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో అలియా నటించిన ఈ సినిమాపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోటీపడి మరీ డిస్ లైకులు కొడుతున్నారు నెటిజన్లు. వస్తున్న కొద్దోగొప్పొ వ్యూస్, లైక్స్ కేవలం సంజయ్ దత్ కారణంగానే అనే మాటా వినిపిస్తోంది. Fox Star Hindi యూట్యూబ్ ఛానెల్‌లో భారీస్థాయిలో డిస్‌లైక్స్ వస్తుండడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘సడక్ 2’ ట్రైలర్‌పై అలియా ఎఫెక్ట్ గట్టిగానే పడింది అంటూ చర్చ జరుగుతోంది. ఈ నెల 28న డిజిట‌ల్ మాధ్య‌మం DisneyPlus Hotstar VIP ద్వారా ‘సడక్ 2’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.