Sai Dharam Tej: జనసేనలోకి సాయి ధరమ్ తేజ్.. క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీలో చేరడంపై తేజు రియాక్ట్ అయ్యాడు.

Sai Dharam Tej: జనసేనలోకి సాయి ధరమ్ తేజ్.. క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!

Sai Dharam Tej About Entering Politics And Janasena Party

Updated On : April 20, 2023 / 7:27 PM IST

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తేజు నటించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. జోనర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉండే హీరో తేజు. కాగా, గతేడాది బైక్ యాక్సిడెంట్‌కు గురైన తేజు, పూర్తిగా కోలుకుని చేసిన తాజా చిత్రం ‘విరూపాక్ష’ రేపు(ఏప్రిల్ 21న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్న తేజు, 10టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించాడు.

Sai Dharam Tej : నేనేమి తప్పు చేయలేదు.. యాక్సిడెంట్ అయింది.. తర్వాత కోలుకున్నాక మాటలు రాక ఏడ్చేశా..

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ విరూపాక్ష ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ మూవీగా నిలుస్తుందని అన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్‌టైన్ చేయడంతో పాటు, వారిని థ్రిల్ చేయడం ఖాయమని తేజు తెలిపాడు. ఇక ఈ సినిమాను తొలుత తెలుగులో రిలీజ్ చేస్తున్నామని.. ఇక్కడ బ్లాక్‌బస్టర్ అయ్యాక మిగతా భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామని తేజు తెలిపాడు. మిగతా భాషల్లోనూ తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకుంటానని తేజు అన్నాడు.

Sai Dharam Tej : కెరీర్ మొదటిలో నన్ను గైడ్ చేసింది ఎన్టీఆర్.. సాయి ధరమ్ తేజ్

అటు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తనకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదని.. తనుకు తెలిసింది కేవలం సినిమాలు చేయడమే అని అన్నాడు. ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి కార్యకర్తగా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని.. తనకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని పవన్ సూచించాడని.. రెండు పడవలపై ప్రయాణం చేయొద్దని పవన్ తనకు సూచించినట్లుగా తేజు తెలిపాడు. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారానికి పవన్ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని తేజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.