సాయి ధరమ్ తేజ్‌ ట్వీట్ కి మంచు విష్ణు స్వీట్ వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 12:28 PM IST
సాయి ధరమ్ తేజ్‌ ట్వీట్ కి మంచు విష్ణు స్వీట్ వార్నింగ్

Updated On : February 8, 2020 / 12:28 PM IST

తమ్ముడు, మై లిటిల్ బ్రదర్ ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా.. ఆల్ ది బెస్ట్ అంటూ మంచు విష్ణు.. సాయి ధరమ్ తేజ్‌ ట్విట్ కు రిప్లే ఇచ్చారు. అసలు వీరిమధ్య ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. ప్రస్తుతం సోలో లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తోన్న సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” అంటు తన సోలో బ్రతుకును తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని ట్విట్ చేశాడు.

అంతేకాదు తనలాగా సింగిల్‌ గా ఉన్నవాళ్లు సోలో బ్రతుకును ఎలా గడుపుతున్నారో చెప్పాలని ట్వీట్ చేశారు. దీంతోపాటుగా సోలో బ్రతుకు ఎందుకు బెటరో.. సోలో బ్రతుకు వల్ల తనకున్న అడ్వాంటేజస్‌ను ఈ ట్వీట్‌ లో వివరించారు.
* ఫోన్‌ లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను.
* రెస్టారెంట్‌ కి వెళ్తే నా ఫుడ్‌ కి మాత్రమే నేను పే చేస్తాను. (వాలెట్‌ కి బొక్క పడే ఛాన్సే లేదు)
* క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.
* షూట్, క్రికెట్, జిమ్, హోమ్ అండ్ ఫ్రెండ్స్ – నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వాటితో నేను స్పెండ్ చేయొచ్చు అంటూ సాయి ధరమ్ తేజ్ ట్విట్ చేశాడు.

అయితే ఈ సోలో ట్వీట్‌ పై మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి తేజూ కూడా హహహహ.. విష్ణు అన్న మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా.. అని రిప్లై ఇచ్చారు. మొత్తం మీద ఈ సోలో బ్రతుకు కాన్వర్జేషన్ భలే ఫన్నీగా సాగింది.