Sai Pallavi : అప్పుడు అన్నయ్య అని పిలిచి.. ఇప్పుడు అదే హీరోతో సినిమా చేసిన సాయి పల్లవి..

సాయి పల్లవి త్వరలో దీపావళికి అమరన్ సినిమాతో రాబోతుంది.

Sai Pallavi : అప్పుడు అన్నయ్య అని పిలిచి.. ఇప్పుడు అదే హీరోతో సినిమా చేసిన సాయి పల్లవి..

Sai Pallavi calls a Hero as Brother in Career Beginning now worked with That Hero

Updated On : October 20, 2024 / 10:25 AM IST

Sai Pallavi : సాయి పల్లవి తక్కువ సినిమాలతోనే సౌత్ లో స్టార్ డమ్ సంపాదించింది. త్వరలో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల సినిమాల నుంచి చిన్న గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి త్వరలో దీపావళికి అమరన్ సినిమాతో రాబోతుంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా అమరన్ సినిమాని తెరకెక్కించారు. కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మించడం విశేషం.

Bigg Boss 8 : నాగ మణికంఠ ఎలిమినేట్..? ఆరోగ్య సమస్యలతో.. పంపించేయండి అంటూ ఏడుస్తూ..

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరగ్గా శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. నేను టీవీ ఛానల్ లో పనిచేస్తున్నప్పుడు సాయి పల్లవిని మొదటిసారి కలిసాను. నేను యాంకర్ గా చేసిన ఓ కార్యక్రమానికి సాయి పల్లవి వచ్చింది. ప్రేమమ్ లో ఆమె నటన చూసి ఫిదా అయిపోయి ఫోన్ చేసి అభినందించాను. అప్పుడు సాయి పల్లవి థ్యాంక్యూ అన్నా అని పిలిచింది. ఆమె నన్ను అన్నా అని పిలిచినందుకు సంతోషించాను. సాయి పల్లవి గొప్ప నటి, ఇండస్ట్రీలో ఆమె పేరు ఒక ఫైర్ బ్రాండ్ అని అన్నారు. దీంతో శివకార్తికేయన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..

Sai Pallavi calls a Hero as Brother in Career Beginning now worked with That Hero

కెరీర్ ప్రారంభంలో శివకార్తికేయన్ ని అన్న అని పిలిచి ఇప్పుడు అతనితోనే హీరోయిన్ గా సాయి పల్లవి నటించడం విశేషం. ఇక ఇదే ఈవెంట్ కి మణిరత్నం రాగా.. సాయి పల్లవితో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అని, భవిష్యత్తులో ఆమెతో కచ్చితంగా కలిసి పనిచేస్తానని అన్నారు.