Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

అందాల భామ సాయి పల్లవి తాజాగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగులు తెరకెక్కించిన ఈ సినిమాలో....

Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

Sai Pallavi Clarification On Controversial Comments

Updated On : June 18, 2022 / 9:13 PM IST

Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి తాజాగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగులు తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఆమెను వివాదంలోకి నెట్టేశాయి. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు తరలిస్తున్నారని కొందరు ముస్లింలపై దాడిని కూడా తాను చూడలేకపోయానని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..

సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌తో కొందరు ఆమెపై తీవ్రంగా మండి పడుతున్నారు. ‘‘కశ్మీరి పండితులపై దాడి.. ఆవులు తీసుకెళ్లే వ్యక్తిపై దాడి నీ ఉద్దేశ్యంలో ఒకటేనా..?’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా సాయి పల్లవి తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తాను ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను కొంతవరకే క్లిప్పింగ్ గా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనకు హింస అంటే నచ్చదని.. అది ఎలాంటిదైనా తాను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Sai Pallavi: సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం

అయితే తాను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూస్తే, తాను ఆ కామెంట్స్ ఎందుకు చేశానో అర్థమవుతుందని, అంతేగాని ఒక క్లిప్పింగ్ మాత్రమే చూసి తనపై ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి సమయంలో కూడా తన వెంటే ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది ఈ బ్యూటీ. ఇకపై తానేదైనా విషయాన్ని మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని మాట్లాడుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఏదేమైనా సాయి పల్లవి ఇచ్చిన క్లారిటీతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)