తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ అభిమానులు మెప్పిస్తున్న నటి సాయి పల్లవి పరీక్షలు రాసింది. ఎగ్జామ్ సెంటర్ లోకి వచ్చిన సాయి పల్లవిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మాస్క్ ధరించిన ఈ బ్యూటీ..చిరునవ్వు పలకరిస్తూ..వారికి ఫోటోలిచ్చింది. అందరిలాగానే..హాల్ సెంటర్లో క్యూలో నిలబడి..పరీక్షలు రాసింది. మంగళవారం తిరుచ్చికి వెళ్ళి అక్కడ ఎంఏఎం కళాశాలలో పరీక్షలు రాసింది.
ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ…విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసింది. నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్షకు ఈమె హాజరైంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో…తిరుచిలోని MAM కాలేజీలో పరీక్ష నిర్వహించారు.
మంగళవారం హాల్ టికెట్ చేత పట్టుకుని..పరీక్ష కేంద్రానికి చేరుకుంది. కళాశాలకు పరీక్షలు రాయడానికి వచ్చిన ఇతర విద్యార్థులు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఆటోగ్రాఫ్, సెల్ఫీలు దిగారు. విద్యార్థులతో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
మలయాళ చిత్రం ప్రేమమ్ ద్వారా కథానాయికగా పరిచయమైంది. మలయాళం, తమిళం భాషల్లో నటించింది. తన డ్యాన్స్, హావభావాలతో అభిమానులను అలరిస్తోంది.