Producer Annamreddy : సినిమా విడుదలకు ముందే.. నిర్మాత అన్నంరెడ్డి కన్నుమూత

Producer Annamreddy : సినిమా విడుదలకు ముందే.. నిర్మాత అన్నంరెడ్డి కన్నుమూత

Producer Annamreddy

Updated On : May 26, 2021 / 11:43 AM IST

Sai Pallavi’s Film Producer: తెలుగు సినిమా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ కన్నుమూశారు. విశాఖలో నివసించే అన్నంరెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే అన్నంరెడ్డి ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది.



అన్నంరెడ్డి లేటెస్ట్‌గా సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ జంటగా నిర్మించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’ ఓటీటీలో విడుదల కాబోతుంది.



ఈ సినిమా విడుదల సమయంలోనే అన్నంరెడ్డి చనిపోయారు. నిర్మాత కృష్ణకుమార్‌ మృతిపట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే పరిశ్రమలో పేరు పొందిన గాయకుడు జి.ఆనంద్‌, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌జీతో పాటు రచయిత నంద్యాల‌ రవి, నటుడు టీఎన్‌ఆర్‌, పీఆర్వో బీఏ రాజు వంటివారు వరుసగా చనిపోగా.. ఇదే క్రమంలో అన్నంరెడ్డి చనిపోవడం బాధాకరం అంటున్నారు సినీ పెద్దలు.