అయ్య‌ప్ప స్వాముల‌కి అన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన హీరో

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 03:24 AM IST
అయ్య‌ప్ప స్వాముల‌కి అన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన హీరో

Updated On : November 21, 2019 / 3:24 AM IST

సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా హైదరాబాద్ ఫిలింన‌గ‌ర్‌ లోని దైవ స‌న్నిధానంలో 500 మంది అయ్య‌ప్ప స్వాముల‌కి అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయ్య‌ప్ప స్వామి పూజ అనంతరం తేజ్ స్వాముల‌కి స్వ‌యంగా వ‌డ్డించారు. ఈ సంద‌ర్భంగా సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ.. అయ్య‌ప్ప స్వామి సేవ‌లో పాల్గొన‌డం నాకు చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. 

ఇక తను నటించిన రీసెంట్ మూవీ ‘ప్ర‌తి రోజూ పండ‌గే’. ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. డిసెంబ‌ర్‌లో  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.  

అంతేకాదు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా కూడా ప్రారంభించాడు తేజూ. ఈ సినిమాలో తేజ్ కు జంటగా నభా నటేష్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమా మే1, 2020న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.