Saif Ali Khan
Saif Ali Khan : 2023 జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ‘ఆదిపురుష్’ సినిమా. సినిమా విడుదలైన 7 నెలల తర్వాత ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. ఆదిపురుష్ అపజయం తర్వాత తను ఎలా ఫీలయ్యారో షేర్ చేసుకున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అని కాదు.. పవర్ స్టార్ అని పిలవాలి.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ గతేడాది జూన్ 16న విడుదలైంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి సిరీస్-రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమాను దాదాపుగా 103 రోజులపాటు షూట్ చేశారు. అయితే అనుకున్నట్లుగా ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో మూవీ టీమ్ పెద్దగా మాట్లాడలేదు. ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) గా నటించిన సైఫ్ అలీఖాన్ లుక్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమా డిజాస్టర్‌పై ఆ నటుడు 7 నెలల తర్వాత మొదటిసారి స్పందించారు.
‘కొన్ని సినిమాలు చేసేటపుడు రిస్క్ చేయాలి..ఓటమిని ఎదుర్కోవాలి..నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అయినా సింపుల్‌గా ఉండేవారు. వారిలాగే నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవను. వాస్తవంలో బతుకుతాను. ఆదిపురుష్ వంటి సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఓటమితో భయపడను..ఒక్కోసారి చేసే ప్రయత్నాలు విఫలమైనపుడు అధైర్య పడకూడదు.. నెక్ట్స్ సినిమాలో చూసుకుందామని ముందుకు సాగాలి.. నేను అదే ఫాలో అవుతానని’ సైఫ్ అలీఖాన్ చెప్పారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.